Thursday, March 12, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలఆశ వర్కర్ల  సమస్యలు పరిష్కరిస్తాం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

ఆశ వర్కర్ల  సమస్యలు పరిష్కరిస్తాం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

📰 Generate e-Paper Clip

నవగీతం, జగిత్యాల/ధర్మపురి

గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న ఆశా వర్కర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు. గురువారం ధర్మపురి లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను ఆశ వర్కర్లు కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారని ఇందులో భాగంగా వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఆశ వర్కర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular