Thursday, April 16, 2026
ads
Homeతెలంగాణరాజన్న సిరిసిల్లవేములవాడలో శ్రీరామనవమి వేడుకలకు శ్రీకారం: పోస్టర్ల విడుదల

వేములవాడలో శ్రీరామనవమి వేడుకలకు శ్రీకారం: పోస్టర్ల విడుదల

📰 Generate e-Paper Clip

నవగీతం రాజన్న సిరిసిల్ల

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించనున్న శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి.శ్రీరామనవమి సందర్భంగా ఈనెల 27 శుక్రవారం ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శ్రీ సీతారాముల కళ్యాణం మహోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు.అలాగే ఉగాది పండుగ సందర్భంగా ఈనెల 19 గురువారం సాయంత్రం 4.30ని.లకు పంచాంగ శ్రవణం నిర్వహించనున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమాల ప్రచారార్థం జిల్లా వ్యాప్తంగా పోస్టర్ల పంపిణీ చేపట్టారు. ఇందులో భాగంగా మొదటి వాల్ పోస్టర్‌ను ఆలయ ప్రాంగణంలోని ప్రోటోకాల్ కార్యాలయంలో పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ విడుదల చేశారు.ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్లు నరాల రాజు, సింహాచారి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular