నవగీతం, కర్నూలు:
కర్నూలు జిల్లా నందవరం మండల పరిధిలోని జడ్పీహెచ్ స్కూల్ నాగలదిన్నెలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రముఖ బాల సాహిత్యవేత్త, బాలబంధు గద్వాల సోమన్నను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్టాత్మక ఉగాది పురస్కారం -2026 వరించింది.అనతి కాల వ్యవధిలో 94 పుస్తకాలు వ్రాసి ముద్రించి, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకుని పలువురు ప్రముఖులచే ప్రశంసలు అందుకున్నారు.శతాధిక గ్రంథకర్తకు అతి సమీపంలో ఉన్నారు.తెలుగు సాహిత్యంలో ముఖ్యంగా బాలసాహిత్యంలో విశేష కృషికిగాను ఉగాది పర్వదినం సందర్భంగా గురువారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ,దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మరియు విచ్చేసిన ప్రముఖుల చేతులు మీదుగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్బంగా తుమ్మలపల్లి కళాక్షేత్రం, విజయవాడలో ఈ ఉగాది పురస్కారం అందుకున్నారు.రాష్ట్ర స్థాయి ఉగాది పురస్కార గ్రహీత బహు గ్రంథకర్త గద్వాల సోమన్నను ప్రధానోపాధ్యాయులు అద్దేపల్లి జాన్సన్, తోటి ఉపాధ్యాయులు, శ్రేయోభిలాషులు, విద్యార్థులు అభినందించారు.

