Thursday, April 16, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలమాజీ మంత్రి జీవన్ రెడ్డికి బుజ్జగింపులు షురూ....

మాజీ మంత్రి జీవన్ రెడ్డికి బుజ్జగింపులు షురూ….

📰 Generate e-Paper Clip

నవగీతం, జగిత్యాల ప్రతినిధి:

జీవన్ రెడ్డి ఇంటికి చేరుకున్న మంత్రులు శ్రీధర్ బాబు, లక్ష్మణ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి..జీవన్ రెడ్డితో అల్పాహారం చేస్తూ ముచ్చటిస్తున్న మంత్రులు, నాయకులు.మీడియాను లోపలికి అనుమతించకుండా మంత్రుల రహస్య చర్చలు.. జగిత్యాల జిల్లా కేంద్రంలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. మాజీ మంత్రి జీవన్ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నాలు ప్రారంభమైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు ఆయన నివాసానికి చేరుకుని కీలక చర్చలు జరిపారు. శనివారం ఉదయం మంత్రి శ్రీధర్ బాబు, మంత్రి లక్ష్మణ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తదితరులు జీవన్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు.జీవన్ రెడ్డితో కలిసి అల్పాహారం చేస్తూ మంత్రులు, నాయకులు కొంతసేపు ముచ్చటించినట్లు సమాచారం. పార్టీ పరిణామాలు, జగిత్యాల రాజకీయ పరిస్థితులు, భవిష్యత్ వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది.అయితే ఈ సమావేశం పూర్తిగా రహస్యంగా సాగినట్లు సమాచారం. జీవన్ రెడ్డి ఇంటి వద్దకు చేరుకున్న మీడియా ప్రతినిధులను లోపలికి అనుమతించలేదు. మంత్రులు, ముఖ్య నాయకులు ఇంట్లోనే కూర్చుని రహస్యంగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.ఈ భేటీతో జగిత్యాల రాజకీయాల్లో చర్చలు మరింత వేడెక్కాయి. జీవన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారు ? పార్టీతోనే కొనసాగుతారా ? లేక కొత్త రాజకీయ నిర్ణయం తీసుకుంటారా ? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular