Thursday, April 16, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలకొండగట్టు అంజన్న చెంత కేంద్రమంత్రి.. బండి సంజయ్ ప్రత్యేక పూజలు

కొండగట్టు అంజన్న చెంత కేంద్రమంత్రి.. బండి సంజయ్ ప్రత్యేక పూజలు

📰 Generate e-Paper Clip

నవగీతం,జగిత్యాల ప్రతినిధి:

జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ శనివారం దర్శించుకున్నారు. మధ్యాహ్నం క్షేత్రానికి చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు, అర్చక బృందం మేళతాళాలతో ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా ఆలయ మాడ వీధుల్లో ప్రదక్షిణలు చేసిన మంత్రి, అనంతరం గర్భాలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా అర్చకులు ఆయనకు వేద ఆశీర్వచనాలు అందించి, దేవస్థానం ఈవో అంజన రెడ్డి.స్వామివారి శేష వస్త్రాన్ని కప్పి తీర్థప్రసాదాలను అందజేశారు. తరలివచ్చిన నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు నేతలు బోయినపల్లి ప్రవీణ్ రావు, బండ రమణారెడ్డి, గుగ్గిళ్ళ రమేష్ సాధినేని మునీందర్.మల్యాల మండలాధ్యక్షుడు గాజుల మల్లేశం పాల్గొన్నారు. వీరితో పాటు జిల్లా ఉపాధ్యక్షుడు బింగి వేణు, సంకుర్తి తిరుపతి, బొబ్బిలి వెంకటస్వామి యాదవ్, బోట్ల ప్రసాద్, పొనగంటి రమేష్, కొల్లూరు గంగాధర్ మరియు పలువురు కార్పొరేటర్లు, బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular