Thursday, April 16, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్

ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్

📰 Generate e-Paper Clip

నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలను తప్పకుండా పాటించాాలి.

నవగీతం, ఇబ్రహీంపట్నం:

జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గోదూరు గ్రామంలో నిర్మాణ దశలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనుల పురోగతిని ఆయన ప్రత్యక్షంగా పరిశీలించి, లబ్ధిదారులకు ఇళ్లు త్వరితగతిన అందేలా పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలను తప్పకుండా పాటించాలని, ఎక్కడైనా లోపాలు ఉంటే వెంటనే సరిదిద్దాలని ఆదేశించారు.లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పనులు కొనసాగించేందుకు సంబంధిత శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పనులు ఆలస్యం కాకుండా నిర్దేశిత గడువులో పూర్తి చేసి లబ్ధిదారులకు గృహాలను అందజేయాలని ఆయన పేర్కొన్నారు.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి గృహ సౌకర్యం కల్పించడమే లక్ష్యమని, అధికారులు క్షేత్ర స్థాయిలో నిరంతరం పర్యవేక్షణ చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో మెట్పల్లి ఆర్డీవో నరసింహరావు, హౌసింగ్ పీడీ ప్రసాద్ ఎంపీడీవో ఎమ్మార్వో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular