రోడ్డు భవనాల శాఖ మంత్రిని కోరిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
నవగీతం, జగిత్యాల ప్రతినిధి:
రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిని వారి కార్యాలయంలో జగిత్యాల ఎమ్మెల్యే డా. యం.సంజయ్ కుమార్ కలిసి జగిత్యాల నియోజకవర్గం లో అభిరుద్ది పనులకు నిధులు మంజూరు చేయాలని వినతిపత్రాన్ని అందజేశారు.జగిత్యాల నియోజకవర్గం లో అనేక వంతెనలు చెడిపోయినాయి. అదేవిధంగా రామాజీపేట, రాయికల్, పెంబట్ల బ్రిడ్జ్ ల పని పూర్తి అయినా గాని వాటి అప్రోచ్ రోడ్డు పూర్తి కాలేదు అని. పలు చోట్ల రోడ్లు రెన్యూవల్ చేయాల్సిన అవసరం ఉందనీ, నూతన రోడ్లు కూడా మంజూరు ఇప్పించాలని సారంగాపూర్ పోతారం,జగిత్యాల పోతారం, అంతర్గం నూతన రోడ్లు కావాలని నూతనంగా కొన్ని బ్రిడ్జ్‌లు గోవిందపల్లి బ్రిడ్జ్, నర్సింగ పూర్ బ్రిడ్జ్, పెరకపల్లి బ్రిడ్జ్, లో లెవెల్ బ్రిడ్జి లు రాయికల్ సారంగాపూర్ మండలంలో బ్రిడ్జి లు ఉన్నాయి, కొత్త వాటికి టెండర్ పిలవాల్సిందిగా వినతి పత్రాన్ని అందజేశారు.సానుకూలంగా స్పందించిన మంత్రి ఇంజనీర్ ఇన్ చీఫ్ మోహన్ నాయక కిఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కి జగిత్యాల నియోజకవర్గ ప్రజల పక్షాన హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

