నవగీతం, మెట్ పల్లి ప్రతినిధి :
మెట్‌పల్లి పట్టణంలో రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రిగా సేవలందిస్తున్న ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని కోరుట్ల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎం.డి. షాకీర్ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేశారు. అలాగే మహిళా మండలి, అంగన్వాడీ కేంద్రాలలో కేక్ కట్ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో సోనియా గాంధీ సమైక్య సంఘం అధ్యక్షురాలు అరిసెల మాధవి, మాజీ అధ్యక్షులు పట్ల లావణ్య, స్వప్న, నర్సమ్మ, హసీనా, రాజ్వాన తదితరులు పాల్గొన్నారు. ఆసుపత్రిలో నిర్వహించిన పంపిణీ కార్యక్రమంలో ఆర్.పీ. వాణిశ్రీ, ఇస్మాయిల్ ఖాన్, కాళీం బేగ్, రహీం, ఎహ్సాన్, చాంద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎం.డి.షాకీర్ మాట్లాడుతూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, వికలాంగుల పేదల ఆశాజ్యోతిగా నిలుస్తూ జగిత్యాల జిల్లాను అభివృద్ధి మార్గంలో ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. ఆయన ఆరోగ్యంగా, క్షేమంగా ఉండాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థానాలను అలంకరించాలని ఆకాంక్షించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ జగిత్యాల జిల్లా అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా ఎం.డి. షాకీర్ తెలిపారు.

