Thursday, April 16, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలచిన్న హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్

చిన్న హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్

📰 Generate e-Paper Clip

నవగీతం,జగిత్యాల ప్రతినిధి:

చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా జగిత్యాల రూరల్ మండలం చల్గల్ గ్రామంలో జరిగిన వేడుకలలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొని ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జగిత్యాల రూరల్ మండలం అంతర్గం గ్రామంలో చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ ఆలయంలో ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ద్వారా మంజూరైన హనుమాన్ ఆలయ అభివృద్ధి కోసం రూ. 5 లక్షలు,మడేలేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కొరకు రూ. 3 లక్షల ప్రొసీడింగ్ పత్రాలు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ నిర్వాహక సభ్యులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, హనుమాన్ భక్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular