Friday, April 17, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలకోరుట్ల గడ్డపై ఇంటర్నేషనల్ గెలుపు జెండా

కోరుట్ల గడ్డపై ఇంటర్నేషనల్ గెలుపు జెండా

📰 Generate e-Paper Clip

అలయన్స్ క్లబ్ అంతర్జాతీయ డైరెక్టర్‌గా కటుకం రాజేంద్రప్రసాద్ ఏకగ్రీవ ఎన్నిక

నవగీతం,కోరుట్ల ప్రతినిధి:

రాజస్థాన్‌లోని జైపూర్‌లో అంగరంగ వైభవంగా జరిగిన అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్‌లో కోరుట్ల ఖ్యాతి అంతర్జాతీయ స్థాయికి చేరింది. పట్టణానికి చెందిన ప్రముఖ సీనియర్ న్యాయవాది, సామాజిక సేవా తత్పరుడు కటుకం రాజేంద్రప్రసాద్ 2026–27 సంవత్సరానికి గాను అలయనిస్టిక్ ఇంటర్నేషనల్ డైరెక్టర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికై సరికొత్త చరిత్ర సృష్టించారు. ఎన్నికల అధికారి అవినాష్ చంద్ర ఒరిజీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించగా, ఇకపై ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో సంస్థ కార్యకలాపాలకు రాజేంద్రప్రసాద్ దిశానిర్దేశం చేస్తారని అంతర్జాతీయ అధ్యక్షుడు బాలాజీ శాస్త్రి స్పష్టం చేశారు. తనపై నమ్మకంతో ఈ గురుతర బాధ్యతను అప్పగించిన ఫౌండర్ ప్రెసిడెంట్ బి.తిరుపతి రాజుకు, ఇతర సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ.. తెలుగు రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలను మరింత ఉధృతం చేసి సంస్థాభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని రాజేంద్రప్రసాద్ ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. ఈ అద్భుత విజయంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యాయవాదులు, అలయన్స్ క్లబ్ ప్రతినిధులు ఆయనను అభినందనలతో ముంచెత్తుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular