Thursday, September 24, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలమల్లాపూర్ మండల మైనారిటీ అధ్యక్షుడిగా మహమ్మద్ అమీన్ ఎన్నిక

మల్లాపూర్ మండల మైనారిటీ అధ్యక్షుడిగా మహమ్మద్ అమీన్ ఎన్నిక

📰 Generate e-Paper Clip

మల్లాపూర్, సెప్టెంబర్ 24 (నవగీతం): మల్లాపూర్ మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన మైనారిటీ సంఘం మండల కమిటీ ఎన్నికల్లో రాఘవపేటకు చెందిన మహమ్మద్ అమీన్ మండల అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన సభ్యులు పాల్గొన్నారు.

కమిటీ నూతన కార్యవర్గంలో ఉపాధ్యక్షుడిగా మహమ్మద్ రఫీ, మరో ఉపాధ్యక్షుడిగా షేక్ ఫరీద్ , జనరల్ సెక్రటరీగా మహమ్మద్ సల్మాన్ , క్యాషియర్‌గా మహమ్మద్ అంకుష్, కార్యదర్శిగా షేక్ ఇమామ్ ఎన్నికయ్యారు.

గౌరవ సలహాదారులుగా మహమ్మద్ రఫీ  మహమ్మద్ మహబూబ్  లను ఎన్నుకున్నారు. కార్యవర్గ సభ్యులుగా మహమ్మద్ ఖాజా  మహమ్మద్ అల్లా బకాష్ , మహమ్మద్ బాసు బాయ్ ,మహమ్మద్ సదుల్లా , మహమ్మద్ సదుల్లా ఎన్నికయ్యారు.

నూతన కమిటీ పదవీకాలం రెండు సంవత్సరాలు కొనసాగనుంది. అధ్యక్షుడిగా ఎన్నికైన మహమ్మద్ అమీన్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన మండలంలోని మైనారిటీ సోదరులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. మైనారిటీ సోదరుల ఐక్యత, సంక్షేమం కోసం అందరి సహకారంతో పనిచేస్తానని పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular