Friday, April 17, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలబార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా తోట ఆంజనేయులు

బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా తోట ఆంజనేయులు

📰 Generate e-Paper Clip

విజేతలను అభినందించిన జూనియర్ సివిల్ జడ్జి కాసుల పావని

నవగీతం,కోరుట్ల ప్రతినిధి:

కోరుట్ల బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికలు శనివారం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో ముగిశాయి. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు స్థానిక కోర్టు ప్రాంగణంలో పోలింగ్శాం తియుతంగా నిర్వహించబడింది. సభ్యులందరూ పెద్ద ఎత్తున పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఎన్నికల అధికారులు ఎం.డి. మెబీన్ పాషా, గోసికొండ సురేష్ సూర్యనారాయణ ప్రసాద్‌లు వెల్లడించారు.ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాలను అధికారులు అధికారికంగా ప్రకటించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా తోట ఆంజనేయులు ఘన విజయం సాధించారు. జాయింట్ సెక్రటరీ: కడకుంట్ల దినేష్ ట్రెజరర్: చింతకింది ప్రేమ్ కుమార్ , స్పోర్ట్ సెక్రటరీ: సుతారి నవీన్ కుమార్, లైబ్రరీ సెక్రటరీ: రసబత్తుల రాజశేఖర్ వైస్ ప్రెసిడెంట్‌గా అంబల్ల నాగ నిర్మల, జనరల్ సెక్రటరీగా సుతారి శ్రీనివాస్, కల్చరల్ సెక్రటరీగా ఎం.డి. ఫసీయొద్దిన్ ఎన్నికయ్యారు.కార్యవర్గ సభ్యులు గా అడేపు వినోద్ కుమార్, తొకల రమేష్, చిలువేరి రాజ్‌శేఖర్, వాసాల వందన, మద్దెల రోజా చిట్యల శివ కుమార్, సర్బాజ్ పాషా, కె. వివేక్, పి. ఉమ, టి. శ్రావణి.నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని జూనియర్ సివిల్ జడ్జి కాసుల పావని ప్రత్యేకంగా అభినందించారు. బార్ అసోసియేషన్ అభివృద్ధికి, న్యాయవాదుల సంక్షేమానికి నూతన సభ్యులు కృషి చేయాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular