నవగీతం ,మెట్‌పల్లి ప్రతినిధి:
మెట్‌పల్లి పట్టణంలోని 19వ వార్డులో స్మశాన వాటికకు వెళ్లే మార్గాన్ని సౌకర్యవంతంగా మార్చేందుకు సీసీ రోడ్డు నిర్మాణ పనులను జేసీబీతో ప్రారంభించారు. స్మశాన వాటిక ద్వారం ముందు ఉన్న ప్రధాన రోడ్డు నుంచి ద్వారం వరకు ఈ నిర్మాణం చేపట్టడం వల్ల ప్రజలకు ఎంతో ఉపశమనం కలగనుంది. ఈ పనులను 19వ వార్డు కౌన్సిలర్ బొడ్ల ఆనంద్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వార్డులో మౌలిక సదుపాయాల అభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు, పారిశుధ్యం వంటి అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి చేపడతామని పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన ప్రతి చిన్న సమస్యను గుర్తించి దశలవారీగా పరిష్కరిస్తూ, వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దే దిశగా కృషి చేస్తున్నామని ఆయన అన్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజల సహకారం కూడా ఎంతో అవసరమని, అందరూ కలిసికట్టుగా ముందుకు సాగితే మరింత పురోగతి సాధ్యమవుతుందని తెలిపారు. స్మశాన వాటికకు వెళ్లే మార్గం సులభతరం కావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ, ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగాలని కోరుతున్నారు.

