నవగీతం. కొడిమ్యాల ప్రతినిధి:
గంగాధర మండలం కాచిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన గీకురు అంజయ్య (42) గత నాలుగేళ్లుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ మంచానికే పరిమితమై ఉన్నారు.అంజయ్య పరిస్థితిని గమనించిన జగిత్యాల జిల్లా విద్యుత్ ఉద్యోగుల ఆధ్వర్యంలో పవర్ ఎంప్లాయీస్ ఆర్గనైజేషన్ సభ్యులు ఆయన కుటుంబానికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేశారు. వీరబత్తిని గంగా సాగర్ అభ్యర్థన మేరకు పూడూర్ లైన్‌మెన్ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ సహాయం అందించారు.తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి కుటుంబానికి విద్యుత్ ఉద్యోగులు ఆర్థిక సహాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు.ఈ కార్యక్రమంలో లైన్‌మెన్లు చంద్రశేఖర్, తిరుపతి, వెంకటేశ్వర్లు, కుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సహాయం అందించిన ఆర్గనైజేషన్ సభ్యులకు అంజయ్య కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.

