Friday, September 25, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలఅర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు:మంత్రి అడ్లూరి

అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు:మంత్రి అడ్లూరి

📰 Generate e-Paper Clip

సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి

నవగీతం, జగిత్యాల ప్రతినిధి:

అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలను అందించడమే తమ లక్ష్యమని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. గొల్లపల్లి మండలం  చిల్వకోడూరు గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో సోమవారం కల్యాణ లక్ష్మి, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ మంత్రి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు.

. గొల్లపల్లి మండలానికి చెందిన 24 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి పథకం చెక్కులను. అందజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 107 మందికి లబ్ధిదారులకు రూ.28 లక్షల 6వేల విలువైన చెక్కులను మంత్రి అందజేశారు.చిల్వకోడూరు గ్రామానికి చెందిన కాసా లక్ష్మీరాజం కు రూ.3 లక్షల ఎల్ ఓ సి ని మంత్రి అందించారు. అనంతరం చిల్వకోడూరు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular