Friday, September 18, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలఎస్ఎస్సి స్పాట్ మూల్యాంకన భత్యాలు పెంచాలి

ఎస్ఎస్సి స్పాట్ మూల్యాంకన భత్యాలు పెంచాలి

📰 Generate e-Paper Clip

ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్

నవగీతం, జగిత్యాల ప్రతినిధి:

జగిత్యాల జిల్లా ధరూర్ లోని మౌంట్ కార్మెల్ పాఠశాలలో నిర్వహిస్తున్న ఎస్ఎస్సి స్పాట్ మూల్యాంకన కేంద్రం వద్ద టిటిజెఏసి యుఎస్పిసి జాక్టో రాష్ట్ర శాఖల పిలుపుమేరకు 2025 లో నిర్వహించిన ఎస్ఎస్సి మూల్యాంకనానికి సంబంధించిన రెమ్యునరేషన్ వెంటనే చెల్లించాలని అక్టోబర్ 2024 లో నిర్వహించిన కుల గణన సర్వే కు సంబంధించిన రెమ్యునరేషన్ తక్షణమే చెల్లించాలని గత ఏడు సంవత్సరాలుగా ఎస్ ఎస్ సి స్పాట్ రెమ్యునరేషన్ పెంపు జరగలేదు అదే సమయంలో 10వ తరగతి మూల్యాంకన బత్యం కనీసం 50 శాతం పెంచాలని ఈ సంవత్సరం లో నిర్వహిస్తున్న ఎస్ఎస్సి స్పాట్ మూల్యాంకనానికి సంబంధించిన రెమ్యునరేషన్ కూడా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది అనంతరం జిల్లా విద్యాధికారి రాము గారికి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు బోయిని పెల్లి ఆనంద్ రావు, బైరం హరి కిరణ్,తిరుకోవెల్ శ్యాంసుందర్, తుంగూరి సురేష్,యాల్ల అమర్నాథ్ రెడ్డి, గంగ నరసయ్య, ఎన్నం రామరెడ్డి, బోగ రమేష్, భూమేష్,గుర్రం శ్రీనివాస్ గౌడ్, రామచంద్రం,గట్ల సంతోష్, జితేందర్ రెడ్డి, బన్న, విషప్రసాద్, వేల్పుల స్వామి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular