Thursday, April 16, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలమొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని నిరసన

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని నిరసన

📰 Generate e-Paper Clip

మల్లాపూర్,నవగీతం ప్రతినిధి:

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్ వద్ద  మంగళవారం మొక్కజొన్న రైతులతో కలిసి బిఆర్ఎస్ నాయకులు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని నిరసన తెలిపారు.ఈ సందర్భంగా నాయకులు అక్కడ అరబోసిన మొక్కజొన్న పంటను ను పరిశీలించి ఎండలకు ఎండిపోయి వజను తక్కువ అయి రైతులకు చాలా నష్టం కలిగేలా ఉందని అన్నారు.మన పక్కమండలాలలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనప్పటికిని మల్లాపూర్ లో ఇంకా ప్రారంభం కాలేదు.మొక్కజొన్న రైతులు అరిగోసలు పడడం కిసాన్ సెల్ నాయకులకు కనబడడం లేదా..? కిసాన్ సెల్ అని చెప్పుకుని తిరిగే నాయకులు రైతులకు న్యాయం చేయాలి కదా మరి నాయకులు ఉన్నారా..??లేరా..? అని ఆరోపించారు.ఈ నెల పదోతారీకు వరకు కొనుగోలు కేంద్రం ప్రారంభించకుంటే రైతుల పక్షాన రిలే నిరాహార దీక్షలు చేపట్టి వంట వార్పు వంటి కార్యక్రమాలు చేసి కొనుగోలు కేంద్రం ప్రారంభించేంతవరకు ఉద్యమాన్ని ఆపమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మేజర్ పంచాయతీ సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ తోట శ్రీనివాస్ తోట రాజ రెడ్డి మాజీ జడ్పిటిసి సంధి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి దేవా మల్లయ్య మాజీ ఏఎంసీ వైస్ చెర్మెన్ ముద్దం శరత్ గౌడ్ రాంరెడ్డి బండిలింగస్వామి మొరపుగంగరాజాం మ్యాకాల సతీష్ ఉయ్యాల లక్ష్మణ్ బొక్కల నాగరాజు శ్రీనివాస్ రామ గౌడ్ రవి రాజేశ్వర్, మకిలి రాకెష్, పెద్దిరెడ్డి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular