Tuesday, April 14, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలఘనంగా శ్రీ చైతన్య టెక్నో స్కూల్ గ్రాడ్యుయేషన్ డే

ఘనంగా శ్రీ చైతన్య టెక్నో స్కూల్ గ్రాడ్యుయేషన్ డే

📰 Generate e-Paper Clip

అలరించిన సాంస్కృతిక వేడుకలు

నవగీతం,కోరుట్ల ప్రతినిధి:

స్థానిక కోరుట్ల పట్టణంలోని అల్లమయ్య గుట్ట వద్ద గల ఓ ఫంక్షన్ హాల్ లో శ్రీ చైతన్య టెక్నో స్కూల్ (కోరుట్ల బ్రాంచ్) ఆధ్వర్యంలో గ్రాడ్యుయేషన్ డే సాంస్కృతిక వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా శ్రీ చైతన్య విద్యాసంస్థల ఏ జి యం ఎం. రాజు, పాఠశాల ప్రిన్సిపాల్ ఏ.రేణుక హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా పట్టాలను అందజేశారు. విద్యార్థుల విద్యా ప్రతిభను, వారి అచీవ్‌మెంట్స్‌ను ఈ సందర్భంగా కొనియాడారు.విద్యార్థులు ప్రదర్శించిన రంగురంగుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. శాస్త్రీయ మరియు జానపద నృత్యాలతో విద్యార్థులు వేదికపై తమ ప్రతిభను చాటారు.ఈ సందర్భంగా ఏ జి యం ఎం. రాజు మాట్లాడుతూ.. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి శ్రీ చైతన్య విద్యాసంస్థలు ఎల్లప్పుడూ కృషి చేస్తాయని, విద్యతో పాటు ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయని పేర్కొన్నారు. ప్రిన్సిపాల్ ఏ. రేణుక మాట్లాడుతూ. విద్యార్థుల విజయాల్లో తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకమని, తమ పాఠశాల నాణ్యమైన విద్యను అందించడంలో ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular