Thursday, April 16, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలవెంకటాపూర్‌లో 'అరైవ్ అలైవ్' ప్రచారం: రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు

వెంకటాపూర్‌లో ‘అరైవ్ అలైవ్’ ప్రచారం: రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు

📰 Generate e-Paper Clip

నవగీతం, కోరుట్ల ప్రతినిధి:

రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా కోరుట్ల మండలం వెంకటాపూర్ గ్రామంలో ‘అరైవ్ అలైవ్’ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గ్రామసభలో ఎంపీడీవో, రెవెన్యూ అధికారులు, ఆర్&బీ ఏఈ, ఎంవీఐ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొని రోడ్డు భద్రతపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు.
గ్రామస్థుల సహకారంతో రహదారులపై ఉన్న గుంతలకు ప్యాచ్‌వర్క్ నిర్వహించి, వాహనదారులకు అడ్డంగా ఉన్న పొదలను తొలగించారు.
ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, హెల్మెట్ ధరించడం మరియు అతివేగాన్ని నియంత్రించడం ద్వారా ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చని ఎస్సై సూచించారు.
ప్రమాదాల నివారణకు పాలకవర్గం, వివిధ శాఖల అధికారులు మరియు ప్రజలు సమన్వయంతో పనిచేయాలని అధికారులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular