Saturday, April 18, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి

ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి

📰 Generate e-Paper Clip

టీజీఈజెఏసి జగిత్యాల జిల్లా ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జిలతో నిరసన

నవగీతం,జగిత్యాల ప్రతినిధి:

టిజిఈజెఏసి రాష్ట్ర సంఘం ఆదేశాల మేరకు శుక్రవారం టిజిఈజెఏసి జగిత్యాల జిల్లా పక్షాన జిల్లా చైర్మన్ మిర్యాల నాగేందర్ రెడ్డి, జిల్లా కన్వీనర్ కందుకూరి రవిబాబు ఆధ్వర్యంలో ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, క్లాస్ ఫోర్, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు భాగస్వామ్య సంఘాల ప్రతినిధులు పాల్గొని జిల్లా కలెక్టరేట్ ఎదుట మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ సమస్యలన్ని పరిష్కరించాలని కోరారు. అనంతరం టిజిఈజెఏసి జగిత్యాల పక్షాన అదనపు కలెక్టర్ బిఎస్.లత ద్వారా జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular