… సర్పంచ్ కనుముల వేంకటేష్
నవగీతం,మల్లాపూర్ ప్రతినిధి
మల్లాపూర్ మండలం వేంకట్రావుపేట అంగన్వాడి టీచర్స్ ఆధ్వర్యంలో పోషన్ పక్వాడ కార్యక్రమంలో భాగంగా గ్రామపంచాయతీ ఆవరణలో వచ్చిన గర్భిణీ బాలింతలకు బాలామృతం కోడిగుడ్లు పోషకాహారం అందజేశారు ఈ సందర్భంగా సర్పంచ్ కనుమూల వెంకటేష్ మాట్లాడుతూ ఐసిడిఎస్ ద్వారా సరఫరా చేస్తున్న నిత్యవసర సరుకులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. పిల్లలు గర్భిణీ స్త్రీలు సమతుల్య ఆహారం తీసుకున్నట్లయితే వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఆరోగ్య కరంగా ఉంటారని కోరారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తోట గంగారెడ్డి.ఆరోగ్య కార్యకర్త కోమల. కార్యదర్శి సురేష్ . అంగన్వాడి టీచర్స్ వై సంధ్యారాణి. తోట జమున పద్మ నాయకులు బైన ప్రశాంత్. ఆశ కార్యకర్తలు రాణి. రమ. పిల్లలు తల్లులు పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.


