Sunday, April 19, 2026
ads
Homeతెలంగాణరాజన్న సిరిసిల్లవేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న సినీనటి అనన్య నాగళ్ల

వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న సినీనటి అనన్య నాగళ్ల

📰 Generate e-Paper Clip

నవగీతం,రాజన్న సిరిసిల్ల:

వేములవాడలోని ప్రసిద్ధ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో సినీ హీరోయిన్ అనన్య నాగళ్ల దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, కోడె మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్వామివారి మండపంలో ఆలయ అర్చకులు, వేద పండితులు ఆమెకు ఆశీర్వచనం అందజేశారు.ఈ కార్యక్రమంలో దేవస్థానం డీఈవో భాస్కర శర్మ ఆమెకు లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు.ఇక ‘లీసా’ సినిమా షూటింగ్‌ను కరీంనగర్‌లో పూర్తి చేసుకున్న సందర్భంగా, చిత్ర యూనిట్ సభ్యులు కూడా ఈ దర్శనంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డీపీఓ సతీష్ రెడ్డి, వీడియో గ్రాఫర్, డైరెక్టర్ జోహార్, ప్రొడ్యూసర్ చందు, అలాగే ప్రొడ్యూసర్ బీరప్ప నేని శివ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular