Friday, September 18, 2026
ads
Homeజిల్లా వార్తలుజగిత్యాలఅరుదుగా దొరికే రక్తాన్ని దానం చేసిన జిపిఓ అధికారి

అరుదుగా దొరికే రక్తాన్ని దానం చేసిన జిపిఓ అధికారి

📰 Generate e-Paper Clip

నవగీతం,మెట్ పల్లి ప్రతినిధి:

మెట్ పల్లి పట్టణంలోని కేశవ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఆత్మకూర్ గ్రామానికి చెందిన వర్శిని అను మహిళకు అత్యవసర చికిత్స నిమిత్తం ఓ నెగటివ్ రక్తం ఎక్కించాలని డాక్టర్ చెప్పడంతో అరుదుగా దొరికే రక్తం కాబట్టి పేషెంట్ కుటుంబ సభ్యులు డోనర్ కోసం వెతుకుతూ రక్తదాతల అనుసంధాన కర్త ఉదయ్ కుమార్, మల్లేష్ ని సంప్రదించగా గ్రామ పాలన అధికారుల సంఘం జగిత్యాల జిల్లా అధ్యక్షులు, కోరుట్ల జిపిఓ గా విధులు నిర్వహిస్తున్న ముద్దం రాకేష్ కుమార్ కి సమాచారం తెలుపగా రాకేష్ వెంటనే స్పందించి మెట్ పల్లి పట్టణంలోని బ్లడ్ బ్యాంక్ కి వెళ్లి రక్తం ఇవ్వడం జరిగింది.

అత్యవసర సమయంలో 11వ సారి రక్తదానం చేసి ప్రాణధాతగా నిలిచిన ముద్దం రాకేష్ ని బ్లడ్ బ్యాంక్ సిబ్బంది, రక్తదాతల అనుసంధాన కర్త ఉదయ్ కుమార్, మల్లేష్ , కేశవ హాస్పిటల్ డా.సాయికృష్ణ రెవెన్యూ సిబ్బంది, పేషెంట్ బంధువులు, స్నేహితులు అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular