Friday, September 18, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలఎమ్మార్పీఎస్ జిల్లా సోషల్ మీడియా ఇంచార్జిగా నక్క సతీష్ మాదిగ నియామకం

ఎమ్మార్పీఎస్ జిల్లా సోషల్ మీడియా ఇంచార్జిగా నక్క సతీష్ మాదిగ నియామకం

📰 Generate e-Paper Clip

మందకృష్ణ మాదిగ ఆశయ సాధన లక్ష్యం

నవగీతం,జగిత్యాల ప్రతినిధి:

జగిత్యాల జిల్లా ఎమ్మార్పీఎస్ సోషల్ మీడియా ఇంచార్జిగా జగిత్యాల రూరల్ మండల పరిధిలోని జాబితాపూర్ గ్రామానికి చెందిన నక్క సతీష్ మాదిగ నియమితులయ్యారు. శుక్రవారం జగిత్యాలలో జరిగిన కార్యక్రమంలో ఎంఎస్పి, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు దుమల గంగారం జిల్లా అధికార ప్రతినిధి బెజ్జంకి సతీష్ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు, ఎమ్మార్పీఎస్ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తున్న నక్క సతీష్ సేవలను గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా ఉద్యమ గళాన్ని వినిపించడంలో సతీష్ కీలక పాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.తన నియామకంపై నక్క సతీష్ స్పందిస్తూ.. “ఎమ్మార్పీఎస్ ఉద్యమంలో భాగస్వామ్యం కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నాపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన జిల్లా నాయకత్వానికి, సహకరించిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక కృతజ్ఞతలు.రాబోయే రోజుల్లో ఎమ్మార్పీఎస్ ఆశయాలను సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తానని పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular