Thursday, September 24, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలకొడిమ్యాలలో ఒడ్నాల గంగయ్య మృతి

కొడిమ్యాలలో ఒడ్నాల గంగయ్య మృతి

📰 Generate e-Paper Clip

నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్

నవగీతం,కొడిమ్యాల:

కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన ఒడ్నాల గంగయ్య ఆదివారం రాత్రి మృతి చెందారు.ఈ సందర్భంగా సోమవారం చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.అనంతరం గంగయ్య కుమారుడు ఒడ్నాల సాగర్‌ను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబానికి పెద్ద దిక్కును కోల్పోవడం ఎంతో బాధాకరమని పేర్కొన్నారు.గంగయ్య ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పునుగోటి కృష్ణారావు, బీఆర్‌ఎస్ నాయకులు పులి వెంకటేష్ గౌడ్, కోరండ్ల నరేందర్ రెడ్డి, సురుగు శ్రీనివాస్, కొత్తూరి స్వామి, ఆకునూరి మల్లయ్య, రాచకొండ చంద్రమోహన్, దోమకొండ నర్సయ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular