Friday, September 25, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలఖుతుబోద్దీన్,అజీమ్ కుటుంబాలకు టీపీసీసీ డెలిగేట్ సుజిత్ రావు పరామర్శ

ఖుతుబోద్దీన్,అజీమ్ కుటుంబాలకు టీపీసీసీ డెలిగేట్ సుజిత్ రావు పరామర్శ

📰 Generate e-Paper Clip

నవగీతం,మెట్ పల్లి ప్రతినిధి:

కాంగ్రెస్ పార్టీ పట్టణ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ ఖుతుబోద్దీన్ పాషా, మెట్పల్లి ప్రెస్ క్లబ్ ప్రింట్ మీడియా ప్రధాన కార్యదర్శి మహ్మద్ అజీమ్ ల తల్లి మృతి పట్ల టీపీసీసీ డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్ రావు సంతాపం వ్యక్తం చేశారు.గత ఐదు రోజులు క్రితం వారి తల్లి మరణించగా వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు., కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని.ఈ కష్ట సమయంలో ఆ కుటుంబానికి మనోధైర్యం కలగాలని సుజిత్ రావు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్, కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందే మారుతి, మల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్ముల చిన్నారెడ్డి,వెంకట గిరి,కల్లెడ గంగాధర్, సావుడాల సంజీవ్,బైండ్ల శ్రీకాంత్,సమీర్ సర్కార్ తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular