పెయింటర్స్ అండ్ పీఓపీ వర్కర్స్ యూనియన్
మెట్ పల్లి,ఆగస్టు9,(నవగీతం) మెట్పల్లి పట్టణంలోని మహిమగల తల్లి శ్రీ మహాలక్ష్మీ దేవి, గ్రామ దేవతలైన పోచమ్మ, మైసమ్మ, తాతమ్మలకు మెట్పల్లి డివిజన్ పెయింటర్స్ అండ్ పీఓపీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆదివారం భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.యూనియన్ అధ్యక్షుడు ఏశమేని గణేష్ ఆధ్వర్యంలో అమ్మవార్లకు ఓడి బియ్యం పోసి, యాటపిల్లలతో మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా ఏశమేని గణేష్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలందరూ సుఖసంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని, రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలపై గ్రామ దేవతల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో జీవించాలని అమ్మవార్లను ప్రార్థించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో యూనియన్ ఉపాధ్యక్షుడు ఖాతా వినయ్, ఓడల రాకేష్, ప్రధాన కార్యదర్శి బిజనపల్లి మనోహర్, రైటర్ చౌదరి శివకుమార్,జనగాం రమేష్,క్యాషియర్ మాతంగి శ్రావణ్, సంపత్, ఎరుబోతుల రాజయ్య, రాజశేఖర్,బజరంగ్ తడాస్, పొన్నాల వినయ్,సుంచు రాజు,దొమ్మటి నర్సగౌడ్,గడ్డం రమేష్ తదితరులు పాల్గొన్నారు.

