Monday, November 2, 2026
ads
Homeజిల్లా వార్తలుహైదరాబాద్చెరకు రైతుల అదనపు రవాణా ఛార్జీలు చెల్లించాలి

చెరకు రైతుల అదనపు రవాణా ఛార్జీలు చెల్లించాలి

📰 Generate e-Paper Clip

మంత్రి శ్రీధర్ బాబుకు ముత్యంపేట చెరుకు రైతుల బృందం వినతి

హైదరాబాద్,అక్టోబర్8,(నవగీతం):

మల్లాపూర్ మండల ప్రాంతానికి చెందిన చెరకు రైతులు గత సంవత్సరం కామారెడ్డి షుగర్ ఫ్యాక్టరీకి చెరుకు తరలించిన సందర్భంగా అదనంగా భరించిన రవాణా ఛార్జీలను రైతులకు చెల్లించాలని కోరుతూ టీపీసీసీ డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్ రావు నేతృత్వంలోని చెరుకు రైతు బృందం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందజేసింది.

ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ.. గత సంవత్సరం ముత్యంపేట ప్రాంతం నుంచి కామారెడ్డి షుగర్ ఫ్యాక్టరీకి చెరుకు తరలించేందుకు రైతులు అదనంగా రూ.350 రవాణా ఛార్జీని భరించాల్సి వచ్చిందని తెలిపారు. దీంతో రైతులు ఆర్థికంగా నష్టపోయారని, ఆ అదనపు రవాణా ఖర్చులను ప్రభుత్వం ద్వారా ఇప్పించాలని మంత్రిని కోరారు.

రైతుల సమస్యను సానుకూలంగా విన్న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పందిస్తూ.. అదనపు రవాణా ఛార్జీలకు సంబంధించిన మొత్తాన్ని త్వరలోనే రైతులకు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో చెరకు రైతుల ప్రతినిధులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కిసాన్ సెల్ జాయింట్ కోఆర్డినేటర్ వాకిట సత్యం రెడ్డి, బద్ధం సోమరెడ్డి, ఇట్టెడి నారాయణరెడ్డి, సుంకట జీవన్ రెడ్డి, ఖ్యాతం లింగారెడ్డి, ఎలేటి రాజారెడ్డి, పడాల గంగారెడ్డి, జాల రెడ్డి, ఎలేటి చంద్రయ్య తదితర నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular