Monday, November 2, 2026
ads
Homeజిల్లా వార్తలుహైదరాబాద్సౌదీ అరేబియాలో నిర్బంధంలో ఉన్న తెలంగాణ కార్మికుడిని స్వదేశానికి తీసుకురావాలి

సౌదీ అరేబియాలో నిర్బంధంలో ఉన్న తెలంగాణ కార్మికుడిని స్వదేశానికి తీసుకురావాలి

📰 Generate e-Paper Clip

హైదరాబాద్,అక్టోబర్13,(నవగీతం)

సౌదీ అరేబియాలో నిషేధిత మందుల కేసులో నిర్బంధంలో ఉన్న నిర్మల్ జిల్లా భైంసా మండలం వాలేగావ్‌కు చెందిన వలస కార్మికుడు అరుగుల గంగాధర్‌కు న్యాయ సహాయం అందించి, సురక్షితంగా భారత్‌కు తీసుకురావాలని ఆయన భార్య అరుగుల గంగామణి ప్రజాభవన్‌లో ప్రవాసి ప్రజావాణి ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

రియాద్‌లో ఐదేళ్లుగా కార్మికుడిగా పనిచేస్తున్న గంగాధర్, అనారోగ్యానికి వైద్యుల సూచన మేరకు కొనుగోలు చేసిన మందులను వ్యక్తిగత అవసరాల కోసం సౌదీకి తీసుకెళ్లిన సమయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. మందులకు సంబంధించిన వైద్య ప్రిస్క్రిప్షన్, బిల్లు తమ వద్ద ఉన్నాయని, అవి నిషేధిత జాబితాలో ఉన్న విషయం ఆయనకు తెలియదని గంగామణి పేర్కొన్నారు. అయితే, మందుల చట్టబద్ధత, కేసు స్వభావం, ప్రస్తుత నిర్బంధ స్థితిని సౌదీ అధికారుల ద్వారా నిర్ధారించాల్సి ఉంది.

గంగాధర్ కుటుంబానికి ప్రధాన ఆర్థిక ఆధారం కావడంతో ఆయన నిర్బంధం వల్ల కుటుంబం ఆర్థిక, మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని, కుమార్తె వివాహ ఏర్పాట్లు కూడా నిలిచిపోయాయని గంగామణి రాష్ట్ర ఎన్ఆర్ఐ కమిటి కి తేలిపారు.

ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ రాష్ట్ర  వైస్ చైర్మన్ మందా భీం రెడ్డి, ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ సభ్యుడు స్వదేశ్ పరికిపండ్ల కు కుటుంబ సభ్యులు లింగోరాం, ఓందాస్, సోషల్ వర్కర్ మహేశ్‌లు వినతి పత్రం అందించారు.

ఈ అంశంపై ముఖ్యమంత్రి, ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాల మంత్రి  అనుముల రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి, కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ, రియాద్‌లోని భారత రాయబార కార్యాలయంతో సమన్వయం చేయాలని కుటుంబ సభ్యులు కోరారు. గంగాధర్‌కు న్యాయ న్యాయ సహాయం అందించి సాధ్యమైన విడుదలకు చర్యలు తీసుకోవాలని, ప్రక్రియ పూర్తైన అనంతరం సురక్షితంగా భారత్‌కు తీసుకురావాలని భార్య విజ్ఞప్తి చేశారు.

నిషేధిత మందులను ధ్రువీకరించు కొన్న అనంతరం వినియోగించుకోవాలని, మెడికల్ రిపోర్టులు, డాక్టర్ ప్రెస్క్రీప్షన్ వెంట ఉంచుకోవలని స్వదేశ్ కోరారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular