Friday, September 18, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలధాన్యం తరలింపు, మిల్లింగ్ పనులు వేగవంతం చేయాలి

ధాన్యం తరలింపు, మిల్లింగ్ పనులు వేగవంతం చేయాలి

📰 Generate e-Paper Clip

–జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

నవగీతం, జగిత్యాల ప్రతినిధి :

జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు, నిల్వలు, మిల్లింగ్ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా శనివారం కథలాపూర్ మండలంలోని సిరికొండ గ్రామంలో ఉన్న కొత్త సురేష్, జి.కె.ఎస్, అమీర్ రైస్ మిల్లులను ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మిల్లులలో ధాన్యం నిల్వలు, మిల్లింగ్ ప్రక్రియ, లోడింగ్ మరియు అన్‌లోడింగ్ పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ పరిశీలించి సంబంధిత వివరాలను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం తరలింపు ప్రక్రియను వేగవంతం చేయాలని, మిల్లుల వద్ద ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షణ నిర్వహించాలని సూచించారు. రైతులు విక్రయించిన ధాన్యం సకాలంలో మిల్లులకు చేరేలా చర్యలు తీసుకోవాలని, మిల్లింగ్ పనులు నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని మిల్లర్లకు ఆదేశించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ధాన్యం నిర్వహణ చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల ఆర్డీవో, ఎంఆర్వో, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular