Tuesday, November 3, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలప్రజా వీరుడు పండుగ సాయన్న

ప్రజా వీరుడు పండుగ సాయన్న

📰 Generate e-Paper Clip

కలెక్టరేట్ లో ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు

జగిత్యాల ప్రతినిధి, అక్టోబర్22,(నవగీతం)

నిజాం నిరంకుశత్వానికి,భూస్వామ్య వ్యవస్థ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడి, ఆకలితో అలమటించే నిరుపేదల కడుపు నింపిన బహుజన వీరుడు ప్రజా వీరుడు, తెలంగాణ రాబిన్ హుడ్ ‘పండగ సాయన్న’ జయంతి ఉత్సవాలను గురువారం జిల్లా కలెక్టరేట్ లో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ హాజరై పండుగ సాయన్న చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ

ప్రజా వీరుడు, తెలంగాణ రాబిన్ హుడ్ గా పిలవబడే పండుగ సాయన్న నిజాం నిరంకుశ పాలన కు వ్యతిరేకంగా అణగారిన వర్గాల ఆకలి తీర్చేందుకు ఆనాడు నిజం ప్రభువుల ధాన్యం కారాగాన్ని కొలగొట్టి వాటిని పేదలకు పంచి పెట్టేవాడు అని అన్నారు. ధనవంతుల నుండి, పెట్టు బడుదారుల వ్యవస్థ నుండి భూస్వాముల నుండి, అణగారిన వర్గాలను అణిచివేతకు గురి కాకుండా వారి పై తిరుగుబాటు చేశాడన్నారు. తెలంగాణ ప్రాంత వాసిగా మహబూబ్ నగర్ జిల్లాలో పుట్టిన పండుగ సాయన్న నిజాం పాలన పై అలుపెరుగని పోరాటం చేశాడని ఆయన చిన్నప్పటి నుండే పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప మహనీయుడని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమం లో బీసీ వెల్ఫేర్ అధికారి జయరాజ్, కలెక్టరేట్ ఏ ఓ కిషన్, సిబ్బంది , బీసీ సంఘాల నాయకులు, తదితరులు, పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular