Wednesday, August 5, 2026
ads
Homeజిల్లా వార్తలుజగిత్యాలమహిళా లోకానికే ఆదర్శం సావిత్రీబాయి ఫూలే

మహిళా లోకానికే ఆదర్శం సావిత్రీబాయి ఫూలే

📰 Generate e-Paper Clip

నవగీతం, జగిత్యాల

మహిళా లోకానికే సావిత్రీబాయి ఫూలే ఆదర్శమని తాజా మాజీ మున్సిపల్ ఛైర్పెర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో సావిత్రీబాయి ఫూలే జయంతిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతిని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించగా ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో  ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఉపాద్యాయులకు సత్కరించారుఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తికే వన్నె తేవడమే కాకుండా గొప్ప రచయిత, సంఘ సంస్కర్త, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేసిన మాతృమూర్తి సావిత్రీబాయి ఫూలే అని మాజీ మున్సిపల్ ఛైర్పెర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ మాజీ కౌన్సిలర్ మేక పద్మావతీ పవన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular