Saturday, September 19, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలమోరపల్లి లో ఘనంగా బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

మోరపల్లి లో ఘనంగా బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

📰 Generate e-Paper Clip

నవగీతం, జగిత్యాల ప్రతినిధి:

బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మోరపెల్లి గ్రామంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ జెండా పండుగను నిర్వహిస్తూ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం గత 10 సంవత్సరాల కాలంలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు నాయకులు వివరించారు. తెలంగాణ ఏర్పాటుతోనే ఈ అభివృద్ధి సాధ్యమైందని, ప్రజల జీవితాల్లో విశేష మార్పులు వచ్చాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సహకార సంఘం మాజీ అధ్యక్షులు పత్తి రెడ్డి మహిపాల్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు రాజిరెడ్డి, ఉప సర్పంచ్ గంగరాజం, వార్డు సభ్యులు తిరుపతిరెడ్డి, షరతు విజయ్, లక్ష్మణ్, లింగన్న, చంద్రశేఖర్, మాజీ ఉపసర్పంచ్ దమ్మ లింగరెడ్డి, సంకోజి ప్రకాష్, మాజీ ఎంపీటీసీ దొంగ మోహన్ రెడ్డి, నాయకులు రామ్మోహన్ రెడ్డి,మల్లారెడ్డి, రాజిరెడ్డి, దయాకర్ రావు, భీమ్ రెడ్డి, బీఆర్‌ఎస్ యువ నాయకులు శేఖర్, నరేష్, గంగాధర్,బన్నీ, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular