Friday, September 18, 2026
ads
Homeతెలంగాణరాజన్న సిరిసిల్లరాజన్న సిరిసిల్ల జిల్లాలో మద్యం ప్రియుల పేరిట వినతి పత్రం

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మద్యం ప్రియుల పేరిట వినతి పత్రం

📰 Generate e-Paper Clip

మద్యం ధరల పెంపుపై జిల్లా కలెక్టర్ కు లేఖ రాసిన మద్యం ప్రియులు

సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వినతిపత్రం

నవగీతం, (రాజన్న సిరిసిల్ల):

మద్యం ధరల పెంపుపై రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కు మద్యం ప్రియుల పేరిట వినతి పత్రం రాసినట్లు ఓ లేఖ సిరిసిల్ల షోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ లేఖలో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ ధరలు చలామణి అవుతున్నట్లు లేఖలో తెలిపారు. మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం మద్యంపై 20 నుంచి 30 శాతం రేట్లు పెంచే యోచనలో ఉన్నట్లు తెలిసిందని వినతి పత్రంలో పేర్కొన్నారు. మద్యం ధరలు పెంచకుండా యధావిధిగా కొనసాగించేలా ప్రభుత్వానికి కలెక్టర్ తెలియజేయాలని వినతి పత్రం అందజేస్తున్నట్లు అర్జీలో ద్వారా తెలిపారు. అయితే మందుబాబుల పేరిట రాసిన ఈ వినతిపత్రం కలెక్టర్ వరకు చేరిందో లేదో తెలియదుగాని, సోషల్ మీడియాలో మాత్రం తెగ వైరల్ అవుతుంది. కాగా మద్యం ధరల పెంపు పై కలెక్టర్ కు లేఖ రాసిన మద్యం ప్రియుల పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular