Sunday, August 2, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలసాదుల్లా కుటుంబానికి రూ.51 వేల ఆర్థిక సాయం

సాదుల్లా కుటుంబానికి రూ.51 వేల ఆర్థిక సాయం

📰 Generate e-Paper Clip

నవగీతం,ఇబ్రహీంపట్నం: జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గోధూర్ గ్రామానికి చెందిన ఎం.డి. సాదుల్లా ఇటీవల ఆకస్మికంగా మృతి చెందడంతో ఆయన కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకున్న పదో తరగతి సహపాఠులు మానవత్వాన్ని చాటుకున్నారు. తమ వంతుగా తలా కొంత మొత్తం విరాళంగా అందించి మొత్తం రూ.51,000 సేకరించారు.సేకరించిన మొత్తాన్ని సాదుల్లా కుమార్తె పేరుతో పోస్టాఫీసులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయించి, గ్రామ సర్పంచ్ బండి రాజేష్, ఉపసర్పంచ్ ఓంకారి లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఆ డిపాజిట్‌కు సంబంధించిన చెక్కును సాదుల్లా కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా సాదుల్లా కుటుంబానికి అండగా నిలిచిన సహపాఠుల సేవాభావాన్ని గ్రామస్థులు అభినందించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బండి రాజేష్, ఉపసర్పంచ్ ఓంకారి లక్ష్మణ్, క్లాస్‌మేట్స్ సాత్పడి శ్రీనివాస్, శ్రీధర్, రమేష్, శేఖర్, పవన్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular