Wednesday, August 5, 2026
ads
Homeజిల్లా వార్తలుజగిత్యాలస్వాతంత్ర్య పోరాటానికి సైనిక బలం చేకూర్చిన ధీరుడు నేతాజీ..

స్వాతంత్ర్య పోరాటానికి సైనిక బలం చేకూర్చిన ధీరుడు నేతాజీ..

📰 Generate e-Paper Clip

నవగీతం,మల్లాపూర్

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామంలో నేతాజీ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య పోరాటంలో అగ్నిపర్వతంలా ఉప్పొంగిన మహానాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ “నాకు రక్తం ఇవ్వండి… మీకు స్వాతంత్ర్యం ఇస్తాను” అనే నినాదంతో కోట్లాది భారతీయులలో దేశభక్తిని రగిలించారు.ఆజాద్ హింద్ ఫౌజ్‌ను స్థాపించి, బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎదురు నిలబడి స్వాతంత్ర్య పోరాటానికి సైనిక బలం చేకూర్చిన ధీరుడు నేతాజీ.ఆయన త్యాగం, ధైర్యం, దేశభక్తి నేటి తరానికి స్ఫూర్తిదాయకం. దేశ అభివృద్ధికి కృషి చేయడమే ఆయనకు నిజమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గోల్కొండ కళ రమేష్ ఉప సర్పంచ్ దండవేని రాజేందర్ విడిసి చైర్మన్ వంగ శ్రీనివాస్ మాజీ చైర్మన్ మహబూబ్ కాంగ్రెస్ నాయకులు యేలేటి జలపతి రెడ్డి నైనేని రాజేందర్ వెంకటేష్ గోల్కొండ పవన్ బాపుస్వామి తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular