Thursday, April 16, 2026
ads
Homeఎడిటోరియల్అష్టగుర్తిలో ఘనంగా ముగ్గుల పోటీలు

అష్టగుర్తిలో ఘనంగా ముగ్గుల పోటీలు

📰 Generate e-Paper Clip

నవగీతం, వైరా:

వైరా మండలం అష్ణగుర్తి గ్రామంలో సంక్రాంతి సందర్భంగా శ్రీ కోదండ రామాలయం ప్రాంగణంలో ఘనంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. మొదటి బహుమతి చిత్తారు అనంతరాములు జ్ఞాపకార్థం చిత్తారు నాగరాజు, ద్వితీయ బహుమతి చిత్తారు శ్రీ యాన్వి తల్లిదండ్రులు చిత్తారు సిద్దు, శ్రీలత దంపతులు, మూడవ బహుమతి వీరవల్లి వెంకటేశ్వరరావు జ్ఞాపకార్థం వారి మేనల్లుడు వెచ్చ నాగేశ్వరరావు స్పాన్సర్ చేశారు. మొదటి బహుమతి గుమ్మా రమ్య, ద్వితీయ బహుమతి గుమ్మా రోషిని, తృతీయ బహుమతి ఎం.కళ్యాణి గెలుపొందారు. ఈ కార్యక్రమంలో ఐద్వా వైరా డివిజన్ కార్యదర్శి గుడిమెట్ల రజిత, అష్ణగుర్తి సర్పంచ్ కంచర్ల అనిత, ఉప సర్పంచ్ గుమ్మ స్వరూప, సిపిఐ(ఎం) పార్టీ శాఖ కార్యదర్శి చిత్తారు నాగరాజు, సీనియర్ నాయకులు కొణిదెన కోటేశ్వరరావు, బిఆర్ఎస్ నాయకులు కందుల ఓంకర్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యూత్ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular