Thursday, June 18, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలకొండగట్టు అంజన్నను దర్శించుకున్న అదనపు జడ్జి దంపతులు

కొండగట్టు అంజన్నను దర్శించుకున్న అదనపు జడ్జి దంపతులు

📰 Generate e-Paper Clip

నవగీతం,కొడిమ్యాల ప్రతినిధి:

జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో జగిత్యాల ఫస్ట్ అదనపు సెషన్స్ జడ్జిగా నియమితులైన సి. సునీత రవీందర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన అనంతరం గురువారం కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు.ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు స్వస్తి వేదమంత్రాలతో జడ్జి దంపతులను ఆలయానికి ఆహ్వానించారు. అనంతరం వారు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ స్థానాచారి కపిందర్ జడ్జి దంపతులకు శేషవస్త్రం అందించి,తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కోర్టు అధికారులు, స్థానిక ఎస్ఐ నరేష్, ఏఎస్ఐ రమణారెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ ఉపాధ్యాయుల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular