Thursday, April 16, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలవైద్య ఆరోగ్య సేవలపై అవగాహన

వైద్య ఆరోగ్య సేవలపై అవగాహన

📰 Generate e-Paper Clip

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

నవగీతం,కోరుట్ల ప్రతినిధి:

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా కథలాపూర్ మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన మండల స్థాయి సమావేశంలో వైద్యాఆరోగ్య శాఖ చేపడుతున్న పలు ప్రజాహిత కార్యక్రమాలపై విస్తృత అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కథలాపూర్, అంబరిపేట వైద్యాధికారులు డాక్టర్ పి. సింధూజ, డాక్టర్ జి. రచన మాట్లాడుతూ.. గత నెల మార్చి 6 నుండి ఈ నెల 15 వరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా చేపట్టిన క్లీన్ & గ్రీన్ కార్యక్రమం, ప్రత్యేక వైద్య నిపుణుల శిబిరాలు, మరియు అసంక్రామిక వ్యాధుల గుర్తింపుపై వివరించారు. ముఖ్యంగా ఔట్ రీచ్ గ్రామాల్లో వడదెబ్బపై అవగాహన, హెచ్.పి.వి వ్యాక్సినేషన్ ప్రాధాన్యత, మాతా శిశు సంరక్షణ, సన్ స్ట్రోక్ నివారణ చర్యలతో పాటు కీటక జనిత వ్యాధుల నియంత్రణకు తీసుకుంటున్న జాగ్రత్తలను సవివరంగా తెలియజేశారు. ఇదే వేదికపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని వైద్యాధికారి డాక్టర్ సింధూజ పర్యవేక్షించగా, పలువురు రోగులకు కంటి పరీక్షలు నిర్వహించి తగిన సలహాలు సూచనలు అందించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular