వైరా మండల కమిటీ ఎన్నిక
నవగీతం,వైరా:
క్రైస్తవ సమాజం యొక్క సర్వతోముఖాభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా అసోసియేషన్ ఆఫ్ ఇండిపెండెంట్ క్రిస్టియన్ కమిటీ (ఎఐసిసి) నిరంతరంగా పనిచేస్తోందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రెవరెండ్ ఏనోష్ కుమార్ స్పష్టం చేశారు. వైరా పట్టణంలో దైవజనులు జి. జాన్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన క్రైస్తవ నాయకుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఏనోష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రైస్తవ సమాజ సంక్షేమానికి అనేక పథకాలను అమలు చేస్తూ సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. క్రైస్తవ సమాజం ఎదుర్కొంటున్న పలు సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి తక్షణ పరిష్కార చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు.అసోసియేషన్ ఆఫ్ ఇండిపెండెంట్ క్రిస్టియన్ కమిటీ మండల అధ్యక్షులుగా కె ప్రభుదాస్, వైస్ ప్రెసిడెంట్ వర్ధన్ రావు, జనరల్ సెక్రటరీ ఎం జాషువా, జాయింట్ సెక్రటరీ ఇశ్రాయేలు, కోశాధికారి జి విజయ చక్రవర్తి, గౌరవ అధ్యక్షులు జయరాజు, ప్రేయర్ సెల్ మండల అధ్యక్షులు సిహెచ్ పాల్ రాజ్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కే రాజేష్, ఎలీషా, జాయ్ సన్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ధర్నాసి బాలరాజు, దాసరి డేవిడ్ రాజు, తేళ్ల ఎబినేజర్, రాయల తిమోతి, ఆదూరి రాజశేఖర్, పలువురు సేవకులు పాల్గొన్నారు.

