Friday, April 17, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలువైరా శిక్షణ సబ్ రిజిస్ట్రార్ గా బి మాధవ్

వైరా శిక్షణ సబ్ రిజిస్ట్రార్ గా బి మాధవ్

📰 Generate e-Paper Clip

8 ఉద్యోగాలు సాధించిన మాధవ్

నవగీతం,వైరా

గ్రూప్ 1 ఫలితాలలో 36వ ర్యాంక్ సాధించిన వరంగల్ కు చెందిన బి మాధవ్ మంగళవారం డిస్టిక్ రిజిస్టర్ శిక్షణలో భాగంగా వైరాలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నందు శిక్షణ సబ్ రిజిస్ట్రార్ గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కార్యాలయం సిబ్బంది మాధవ్ కు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. వరంగల్ కు చెందిన బి మాధవ్ ఎస్సార్ యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన మాధవ్ 2019లో సబ్ ఇన్స్పెక్టర్ గా ఉద్యోగం పొంది 2025 వరకు విధులు నిర్వహించారు. మాధవ్ తండ్రి పోస్ట్ మాన్ గా విధులు నిర్వహిస్తున్నారు. విద్యాభ్యాసంలో అత్యధిక మార్కులు సాధించుకుంటూ ర్యాంకులు సాధించిన మాధవ్ వరసగా 8 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. 2018లో విఆర్ఓ, గ్రూప్ ఫోర్ లో 37వ ర్యాంక్, సివిల్ ఎస్సై ,రైల్వే ఎస్సై, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ,అసిస్టెంట్ కమాండెంట్, రైల్వే ఇంజనీర్ ఇలా ఉద్యోగాలు వరుసగా సంపాదించిన మాధవ్ గ్రూప్ 1 లో 36వ ర్యాంకు సాధించి ఉమ్మడి ఖమ్మం జిల్లా డిస్టిక్ రిజిస్ట్రార్ శిక్షణ లో భాగంగా వచ్చిన బి మాధవ్ వైరా సబ్ రిజిస్టర్ కార్యాలయం నందు శిక్షణ సబ్ రిజిస్టర్ గా బాధ్యతలు చేపట్టారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular