Friday, April 17, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుగెలుపే లక్ష్యంగా పని చేయాలి..ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

గెలుపే లక్ష్యంగా పని చేయాలి..ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

📰 Generate e-Paper Clip

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

నవగీతం,చొప్పదండి

పట్టణ అభివృద్ధి పనులలో భాగంగా చొప్పదండి పట్టణ కేంద్రంలోని పలు వార్డులలో రూ.2 కోట్ల నిధులతో నూతన సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి స్థానిక నాయకులతో కలిసి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం శంకుస్థాపన చేశారు. అనంతరం మండల కేంద్రంలోని వరలక్ష్మి ఫంక్షన్ హాల్లో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఇప్ప శ్రీనివాస్ రెడ్డి ఆద్వర్యంలో నూతనంగా ఎన్నికైన సర్పంచు, ఉప సర్పంచులకు సన్మానం చేసి, మండల పరిధిలోని 38 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. తదుపరి రాబోయే మున్సిపల్ ఎన్నికలలో భాగంగా నిర్వహించిన చొప్పదండి మున్సిపాలిటీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పట్టణంలోని అన్ని వార్డ్ లలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఇటీవల వెదురుగట్ట గ్రామానికి చెందిన చిలుక నరేష్ కుమారుడు ప్రణవ్ రాజ్ అనే బాలుడికి లివర్  ట్రాన్స్ ప్లాంటేషన్ జరగగా ముఖ్యమంత్రి సహాయనిధి నుండి రూ.2,50,000/-మంజూరు చేయించి నేడు వారి ఇంటికి వెళ్లి బాలుడిని పరామర్శించి కుటుంబ సభ్యులకు చెక్కును అందజేశారు. ఇట్టి కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ప్రజాప్రతినిధులు , మహిళలు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular