Friday, April 17, 2026
ads
Homeఎడిటోరియల్కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి..

కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి..

📰 Generate e-Paper Clip

మొక్కజొన్న రైతులకు మద్దతుగా ప్రజా ప్రభుత్వం.

నవగీతం మల్లాపూర్ ప్రతినిధి:

మల్లాపూర్ మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏఎంసీ చైర్మన్ అంతడుపుల పుష్పలత నర్సయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు పండించిన పంటను దళారులు క్వింటాలుకు రూ. 1600 మాత్రమే చెల్లించి కొనుగోలు చేస్తున్నారని రైతులకు మద్దతు ధర అందించాలని ప్రజా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తుందని పుష్పలత తెలిపారు. రైతులు కొనుగోలు కేంద్రాల్లో మొక్కజొన్నలు విక్రయించి క్వింటాలుకు రూ. 2400 మద్దతు ధర పొందాలని ఆమె కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏనాడు రైతుల సమస్యలు పట్టించుకోలేదని ఆమె అన్నారు. ధాన్యం కొనుగోలు లో క్వింటాల్ కు నాలుగు కిలోల కోత విధించారని కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన రెండు సంవత్సరాలుగా ఎలాంటి  కోత లేకుండా రైతులు పండించిన పూర్తి ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని తెలిపారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి , బట్టి విక్రమార్క తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ,ఆది శ్రీనివాస్, జువ్వాడి నర్సింగరావు, జువ్వాడి కృష్ణారావు, చిత్రపటాలకు కాంగ్రెస్ నాయకులు పాలభిషేకం చేశారు.ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు ఎలాల జలపతి రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంతడుపుల పుష్పలత నరసయ్య ,వైస్ చైర్మన్ ఇట్టేడి నారాయణ, వివిధ గ్రామాల సర్పంచులు దప్పుల పద్మ నర్సయ్య,ఎలేటి వెంకటరెడ్డి కనుముల వెంకటేష్, రోడ్ల రాజారెడ్డి, లింబాద్రి నాయకులు పొతు శేఖర్ నల్ల బాపురెడ్డి పుండ్ర శ్రీనివాస్ రెడ్డి కోటగిరి ఆనంద్ గౌడ్ లింగారెడ్డి సురేష్ నూతపల్లి రాజాం సిరిపురం రవీందర్ ఎర్ర భూమయ్య, భూమారెడ్డి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular