నవగీతం,ఖమ్మం
ఖమ్మం నగరంలోని టిటిడిసీ సమావేశ మందిరం లో జిల్లాలో నూతనంగా గెలుపొందిన గ్రామ పంచాయతీ సర్పంచులకు నిర్వహించే శిక్షణ తరగతులలో సోమవారం అదనపు కలెక్టర్ పి. శ్రీజతో కలిసి, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పాల్గొని గ్రామపాలనలో సర్పంచ్ ల పాత్ర, బాధ్యతలు, ప్రజలకు అందించవలసిన సేవలపై కలెక్టర్ అవగాహన కల్పించారు. గ్రామస్థాయిలో ప్రజల నమ్మకాన్ని పొంది ఎన్నికైన సందర్భంగా ముందుగా సర్పంచ్ లకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ గ్రామాల సర్పంచులు ప్రజాప్రతినిధులు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు

