Tuesday, April 14, 2026
ads
Homeఆంధ్రప్రదేశ్తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశాధ్యక్షుడు

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశాధ్యక్షుడు

📰 Generate e-Paper Clip

వగీతం, తిరుపతి

మారిషస్ దేశాధ్యక్షుడు  ధరమ్ బీర్ గోకుల్ బుధవారం ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. క్షేత్ర సాంప్రదాయం ప్రకారం ముందుగా వరాహ స్వామి వారిని దర్శించుకుని శ్రీవారి ఆలయం వద్దకు విచ్చేసిన ఆయనకు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.ముందుగా ధ్వజస్తంభానికి నమస్కరించిన అనంతరం ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద‌ పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ శేష వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటం, క్యాలెండర్, పంచగవ్య ఉత్పత్తులను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్, సీవీఎస్వో మురళీకృష్ణ , జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular