నవగీతం, కర్నూలు:
కర్నూలు జిల్లా నందవరం మండల పరిధిలోని జడ్పీహెచ్ స్కూల్ నాగలదిన్నెలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న బాలబంధు గద్వాల సోమన్న రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్టాత్మక ఉగాది పురస్కారం -2026కు ఎంపిక అయ్యారు. ఈ నెల 19వ తేదిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చేతులు మీదుగా ఉగాది సందర్బంగా తుమ్మల కళా క్షేత్రం విజయవాడలో ఈ ఉగాది పురస్కారం అందుకోనున్నారు. రాష్ట్ర స్థాయి ఉగాది పురస్కారానికి ఎంపికైన బహు గ్రంథకర్త గద్వాల సోమన్నను ప్రధానోపాధ్యాయులు అద్దేపల్లి జాన్సన్,తోటి ఉపాధ్యాయులు, శ్రేయోభిలాషులు అభినందించారు.

