నవగీతం,హైదరాబాద్
హైదరాబాద్ నాంపల్లి లోని ట్రెసా కార్యాలయంలో మంగళవారం తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ 2026 డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో గడచిన రెండేళ్లలో ఎన్నొ విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నాము. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో భ్రష్టు పట్టిన రెవెన్యూ వ్యవస్ధలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చి గ్రామ స్ధాయి వరకు బలోపేతం చేశామని రాష్ట్రంలో దశాబ్దాలుగా సాగుతున్న భూవివాదాలకు శాశ్వత పరిష్కారం లక్ష్యంగా ముఖ్యమంత్రి ఆలోచనకు అనుగుణంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన భూభారతి పోర్టల్ దేశానికే ఆదర్శంగా నిలిచింది తెలిపారు.తెలంగాణ రైతుల భూములకు సంబంధించి గుండెకాయ లాంటి సర్వే విభాగాన్ని బలోపేతం చేసేందుకు ఇప్పటికే 3500 మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లను తీసుకున్నాం. మరో వారం రోజుల్లో 3వేల మందిని తీసుకోబోతున్నాము. ప్రభుత్వ ఉద్యోగులకు అందాల్సిన ప్రయోజనాలు రాష్ట్ర ఆర్ధిక ఇబ్బందుల వల్లే కొంత ఆలస్యం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో ట్రెస్సా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

