Wednesday, April 15, 2026
ads
Homeజిల్లా వార్తలుజగిత్యాలసహస్ర లింగాల దేవాలయంలో సంకష్టహర చతుర్థి వేడుకలు

సహస్ర లింగాల దేవాలయంలో సంకష్టహర చతుర్థి వేడుకలు

📰 Generate e-Paper Clip

నవగీతం,జగిత్యాల

జగిత్యాల రూరల్ పొలాస గ్రామంలోని సహస్ర లింగాల దేవాలయంలో సంకటహర చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సంకటహర చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకొని గణనాథునికి పలు పంచామృతాభిషేకాలు భక్తుల సహస్తాలతో నిర్వహించి పలు పుష్పాలతో చక్కగా అలంకరించి గరిక మాలతో స్వామివారిని అలంకరించారు. అనంతరం స్వామివారికి మంగళ హారతులను నక్షత్ర హారతిని సమర్పించారు. ఈ పూజా కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు వేదమంతో చాలా మద్య నిర్వహించారు అనంతరం భక్తులు గణనాథుని దర్శించుకొని ప్రత్యేక పూజలను నిర్వహించారు విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వచనాన్ని అందజేశారు . ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వహకులు నలామాసు గంగాధర్ ఆలయ కమిటీ సభ్యులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular