నవగీతం,రాయికల్:
రాయికల్ మండలం మహితాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాయికల్ మండలంకు చెందిన పాత్రికేయులు గంగుల శ్రీనివాస్ సారిక దంపతులు సహృదయు ఫౌండేషన్ ద్వారా పాఠశాల విద్యార్థులకు 40 మంది విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్ పెన్నుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెళ్లిరోజు,పుట్టినరోజులకు దుబారా ఖర్చులు చేయకుండా మంచి సేవా కార్యక్రమం ఏదైనా చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మోహన్ రెడ్డి, ఉపాధ్యయులు గంగరాజం, నర్సయ్య లు ఫౌండేషన్ సభ్యులు గంగుల శ్రీనివాస్,మహేష్,వెంకటేష్ అభి ,రాజు, రాము తదితరులు పాల్గొన్నారు

