Friday, April 17, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుబిల్లుపాడు లో ఎన్టీఆర్ వర్ధంతి

బిల్లుపాడు లో ఎన్టీఆర్ వర్ధంతి

📰 Generate e-Paper Clip

నవగీతం,తల్లాడ:

తల్లాడ మండలం బిల్లుపాడు గ్రామం జెకె నగరం సెంటర్ లో టీడీపీ దిమ్మె వద్ద ఆదివారం ఎన్టీఆర్ 30 వర్ధంతి సందర్భంగా నందమూరి తారక రామారావు చిత్ర పటానికి టీడీపీ నాయకులు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.జక్కంపూడిచంద్రశేఖర్,ఎన్టీఆర్ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా టీడీపీ గ్రామ శాఖ అధ్యక్షుడు నారపోగు ప్రసాద్, జక్కంపూడి చంద్రశేఖర్ మాట్లాడుతూ తెలుగు జాతి ఆత్మ గౌరవ పతాకం, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు మహా నాయకుడు ఎన్టీఆర్ తారక రాముడు పోషించిన పౌరాణిక పాత్రల ఫోటోలను ఇళ్లల్లో పెట్టుకొని ప్రజలు దేవుడిగా పూజిస్తుండటం ఎన్టీఆర్ కి మాత్రమే దక్కిన అరుదైన గౌరవం అని భౌతికంగా దూరమై ఇన్నేళ్లయినా తెలుగు వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మహోన్నత వ్యక్తి అన్న ఎన్టీఆర్ అన్నారు. ఈ కార్యక్రమం లో వేముల గోవిందు, జక్కంపూడి రమేష్,నాగేశ్వరావు పులపాల కృష్ణయ్య, రామకృష్ణ, కోటయ్య, కృష్ణయ్య, కృష్ణ, రాజేష్, మహేష్, మస్తాన్, సుబ్బారావు, టీడీపీ మండల నాయకులు.రామయ్య,. వెంకటేశ్వర రావు, కంత్రి, మహేష్, ప్రసాద్, నాగయ్య, రాము, నరసింహారావు, నాగేశ్వరావు లక్ష్మయ్య , శేషయ్య, టీడీపి కార్యకర్తలు ఎన్టీఆర్ , జక్కంపూడి అభిమానులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular